స్పీకర్ పదవి బీజేపీకి

మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా రాహుల్ నర్వేకర్ ఎన్నికయ్యారు. ఈరోజు జరిగిన ఎన్నికలో రాహుల్ ఎన్నికయినట్లు ప్రకటించారు

Update: 2022-07-03 06:38 GMT

మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా రాహుల్ నర్వేకర్ ఎన్నికయ్యారు. కొద్దిసేపటి క్రితం జరిగిన ఎన్నికలో రాహుల్ ఎన్నికయినట్లు ప్రకటించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఈరోజు జరిగాయి. బీజేపీ తరుపున రాహుల్ నర్వేకర్, మహా వికాస్ అఘాడీ తరుపున రాజన్ సాల్వీ బరిలో నిలిచారు. స్పీకర్ ఎన్నికకు ఓటింగ్ ను నిర్వహించారు. ఈ ఓటింగ్ లో రాహుల్ నర్వేకర్ కు 164 ఓట్లు రాగా, రాజస్ సాల్వీకి 20 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో రాహుల్ నర్వేకర్ ఎన్నికయినట్లు ప్రకటించారు.

రేపు బలపరీక్ష.....
మహారాష్ట్ర సంక్షోభం తర్వాత ఈరోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు స్పీకర్ ఎన్నిక, రేపు ఏక్‌నాథ్ షిండే బలపరీక్ష ఎదుర్కొననున్నారు. స్పీకర్ ఎన్నికతోనే బలాబలాలు తెలిసిపోయాయి. సమావేశాలకు హాజరయ్యేందుకు గోవాలో ఉన్న శివసేన రెబల్ ఎమ్మెల్యేలు 39 మంది ఈరోజు ముంబయి చేరుకుని సమావేశాల్లో పాల్గొన్నారు. ఓటింగ్ కు హాజరయ్యారు.


Tags:    

Similar News