రాహులే 'చీఫ్' స్పీకర్ పాత్ర పోషించాలట‌..!

మోదీ ప్రభుత్వం మంగళవారం తొలి అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోనుంది.

Update: 2023-08-08 03:48 GMT

మోదీ ప్రభుత్వం మంగళవారం తొలి అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోనుంది. కొద్ది రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. సంఖ్యాబలం దృష్ట్యా ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదు. అయితే రాహుల్‌ గాంధీ పార్లమెంటు సభ్యత్వ పునరుద్ధరణ నేప‌థ్యంలో.. ఈ అవిశ్వాస తీర్మానంపై చర్చలో ఆయనే చీఫ్ స్పీకర్ పాత్ర పోషించాలని పార్టీ శ్రేణులు కోరుతున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. దీంతో రాహుల్ ఏం మాట్లాడుతార‌నే విష‌య‌మై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

అవిశ్వాస‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన గౌరవ్ గొగోయ్ తన స్థానంలో రాహుల్ గాంధీని చర్చకు అనుమతించాలని సభాపతిని అభ్యర్థించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అవిశ్వాస తీర్మానంపై ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు చర్చ జరగనుంది. మూడు రోజుల్లో 18 గంటల పాటు చర్చ జరగనుంది. ఆగస్టు 10న అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోదీ సమాధానం ఇవ్వనున్నారు. ప్రభుత్వం వైపు నుంచి కనీసం పది మంది ఎంపీలు చర్చలో పాల్గొంటారు.

మణిపూర్ హింస సాకుతో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలు, కేంద్ర దర్యాప్తు సంస్థల రాజకీయ వినియోగం, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో గవర్నర్ల ప్రతికూల వైఖరి, దేశంలో మతసామరస్యంపై విప‌క్షాలు మోదీ ప‌న్ర‌భుత్వాన్ని చుట్టుముట్టనున్నాయి. దీంతోపాటు అనర్హ‌త వేటు ప‌డి.. పార్లమెంటు సభ్యత్వం పునరుద్ధరణ త‌ర్వాత ఎంట్రీ ఇస్తుండ‌టంతో రాహుల్ గాంధీ ప్రసంగంపైనే అందరిదృష్టి ఉంది. రాహుల్ కూడా ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టేందుకు త‌న‌దైన స్టైల్లో సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి.


Tags:    

Similar News