జగన్నాథ రథయాత్రకు పోటెత్తిన భక్తులు

ఒడిశాలోని పూరి జగన్నాధ రథయాత్ర నిన్న ప్రారంభమయింది. జగన్నాధ ఆలయం నుంచి గుండిచా టెంపుల్ వరకూ ఈ యాత్ర సాగనుంది

Update: 2025-06-28 04:07 GMT

ఒడిశాలోని పూరి జగన్నాధ రథయాత్ర నిన్న ప్రారంభమయింది. జగన్నాధ ఆలయం నుంచి గుండిచా టెంపుల్ వరకూ ఈ యాత్ర సాగనుంది. మొత్తం పన్నెండు రోజుల పాటు సాగనున్న జగన్నాధ రథయాత్రలో పాల్గొనేందుకు పూరీకి లక్షల మంది భక్తులు తరలి వచ్చారు. మొదటి రోజు భారీగా తరలి రావడంతో భక్తులు ఇబ్బందులు పడకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు.

రథాన్ని లాగేందుకు...
మొదటి రోజు రథాన్ని భక్తులు లాగారు. నిన్న బలభద్రుని రధాన్ని లాగిన భక్తులు తర్వాత సుభద్ర, జగన్నాధుల రథాలను లాగారు. ఈరోజు జగన్నాధ రథయాత్ర గుండిచా ఆలయానికి చేరుకోనుంది. ఇందుకోసం ఒడిశా ప్రభుత్వం పటిష్టమైన బందోబస్తును ఏర్పాటుచేసింది. కేంద్ర సాయుధ బలగాలను భారీగా మొహరించారు. ప్రసాద సేవలను అనేక సంస్థలు ప్రారంభించాయి. గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ భక్తుల కోసం ప్రసాద సేవను ప్రారంభించింది. దాదాపు ఇరవై లక్షల మంది ఈ రథయాత్రకు హాజరవుతారని అంచనా.


Tags:    

Similar News