Arvind Kejriwal : మొదటి రోజు తీహార్ జైలులో

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తొలి రోజు తీహార్ జైలులో కొంత ఇబ్బందిగానే గడిపినట్లు జైలు వర్గాలు వెల్లడించాయి

Update: 2024-04-02 01:16 GMT

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తొలి రోజు తీహార్ జైలులో కొంత ఇబ్బందిగానే గడిపినట్లు జైలు వర్గాలు వెల్లడించాయి. ఆయనకు జైలులో రెండో నెంబరు గదిని కేటాయించారు. ఇదే జైలులో అరెస్టయిన మనీష్ సిసోడియా నెంబరు వన్ గదిలో ఉండగా, కేజ్రీవాల్ కు రెండో నెంబరు కేటాయిచారు. రాత్రి కేజ్రీవాల్ సక్రమంగా నిద్రపోలేదని, ఏదో చదువుతూ కనిపించారని జైలు సిబ్బది చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టయి పదిహేను రోజుల రిమాండ్ కు విధించిన నేపథ్యంలో ఆయనను తీహార్ జైలుకు తరలించారు.

ఉదయం నుంచి ఇలా...
అయితే ఆయనకు ఈరోజు ఉదయం నుంచి ఇతర ఖైదీలకు మాదిరిగానే అల్పాహారం అందివ్వనున్నారు. టీతో పాటు, కొన్ని బ్రెడ్ స్లైస్‌లు ఇస్తారు ఆ తర్వాత తన న్యాయవాదులతో సమావేశమయితే ఆ అవకాశాన్ని కల్పిస్తారు. ఉదయం పదిన్నర పదకొండు గంటల మధ్య లంచ్ ఇవ్వనున్నారు. లంచ్ లో అన్నం, వెజిటబుల్స్, పప్పుతో పాటు ఐదు చపాతీలను ఇవ్వనున్నట్లు జైలు అధికారులు తెలిపారు. పన్నెండు నుంచి మూడు గంటల వరకూ తన గది దాటి బయటకు రాకూడదు. మధ్యాహ్నం 3.30 గంటలకు మరోసారి చాయ్ ఇస్తారు. సాయంత్రం ఐదు గంటలకు భోజనం అందివ్వనున్నారు. రాత్రి 7 గంటల కల్లా ఆయనకు కేటాయించిన గదిలోకి వెళ్లాల్సి ఉంది.


Tags:    

Similar News