నేడు బీహార్ లో ప్రధాని మోదీ పర్యటన

నేడు పశ్చిమబెంగాల్‌, బీహార్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు

Update: 2025-08-22 04:09 GMT

నేడు పశ్చిమబెంగాల్‌, బీహార్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. కోల్‌కతాలో మెట్రోరైలు ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. బీహార్ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో మోదీ బీహార్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. జెస్సోర్ రోడ్ నుంచి విమానబందర్ వరకు మెట్రోరైలులో ప్రధాని మోదీ ప్రయాణించనున్నారు.

అభివృద్ధి పనులకు...
బీహార్‌లో థర్మల్ పవర్ ప్లాంట్ నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. గయా–ఢిల్లీ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును, వైశాలి–కొడర్మా రైలు సర్వీసులును నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. అనంతరం గయాజీలో బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మోదీ పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.


Tags:    

Similar News