Narendra Modi : నేడు రెండు రాష్ట్రాలకు ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ నేడు రెండు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. బీహార్, పశ్చిమ బెంగాల్ లో ఆయన పర్యటన కొనసాగుతుంది
ప్రధాని నరేంద్ర మోదీ నేడు రెండు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. బీహార్, పశ్చిమ బెంగాల్ లో ఆయన పర్యటన కొనసాగుతుంది. ఈ ఏడాది చివరలో బీఆర్ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని రెండు రాష్ట్రాలలో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలను, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఈరోజు పశ్చిమ బెంగాల్ లో ఐదువేల విలువైన కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
పశ్చిమ బెంగాల్, బీహార్ లలో...
అనంతరం ర్యాలీలో పాల్గొని తర్వాత జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ పర్యటన అనంతరం నేరుగా బీహార్ కు వెళ్లి అక్కడ ఏడు వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఈస్ట్ చంపారన్ జిల్లాలోని మోదీహరీ పట్టణంలోని గాంధీ మైదాన్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. దర్భంగా - నార్కాటియా గంజ్ రైల్వే లైన్ డబ్లింగ్ ను జాతికి అంకితం చేయనున్నారు. ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.