Narendra Modi : నేడు తమిళనాడుకు ప్రధాని నరేంద్ర మోదీ
నేడు తమిళనాడులో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు.
నేడు తమిళనాడులో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. తమిళనాడులో ప్రధాని మోదీ రెండు రోజులపాటు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలను, ప్రారంభోత్సవాలను నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు బహిరంగ సభల్లోనూ ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు.
రెండు రోజుల పాటు...
వచ్చేఏడాది తమిళనాడు శాసనసభకు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రధాని పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈరోజు తూతూకుడి ఎయిర్‌పోర్ట్‌లో కొత్తగా నిర్మించిన టెర్మినల్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ అనంతరం జరిగే బహిరంగసభలో ప్రసంగిస్తారు. రేపు గంగైకొండ చోళపురంను ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించనున్నారు.