Narendra Modi : నేడు పంజాబ్ కు ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ నేడు పంజాబ్ లో పర్యటించనున్నారు. వరదకు గురైన ప్రాంతాలను ప్రధాని నరేంద్ర మోదీ పరిశీలించనున్నారు
ప్రధాని నరేంద్ర మోదీ నేడు పంజాబ్ లో పర్యటించనున్నారు. వరదకు గురైన ప్రాంతాలను ప్రధాని నరేంద్ర మోదీ పరిశీలించనున్నారు. వరద బాధితులతో మాట్లాడనున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంజాబ్ లో తీవ్ర నష్టం వాటిల్లింది. వ్యవసాయ రంగంతో పాటు అనేక ప్రాంతాల్లో ఆస్తులు కోల్పోయారు. అనేక మంది నిరాశ్రయులయ్యారు.
వరద బాధిత ప్రాంతాల్లో...
ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేడు పంజాబ్ లో పర్యటించనున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పంజాబ్ కు వరద సాయాన్ని ప్రకటించే అవకాశాలున్నాయని తెలిసింది. ప్రధాని నరేంద్ర మోదీ వరద తాకిడికి గురైన ప్రాంతాలను పరిశీలించడమే కాకుండా ఫొటో ఎగ్జిబిషన్ ను కూడా పరిశీలించనున్నారు. అధికారులతో మాట్లాడి నష్టం అంచనా వివరాలను అడిగి తెలుసుకోనున్నారు.