Breaking : పీఓకే పై మోదీ కీలక వ్యాఖ్యలు.. తూటాకు క్షిపణితో సమాధానం చెప్పండి

ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు

Update: 2025-05-11 11:38 GMT

ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. త్రివిధ దళల అధిపతుల సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్ కాల్పులు జరిపితే భారత్ కూడా కాల్పులు జరుపుతుందని మోదీ తెలిపారు. పీవోకేపై కూడా మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ కు అప్పగించడం మినహా మరో మార్గం లేదన్న మోడీ పాక్ దాడులకు దిగితే భారత్ కూడా దాడులు చేస్తుందని తెలిపారు.

కశ్మీర్ విషయంలో...
ఉగ్రవాదులను అప్పగిందచేవాళ్లు మాట్లాడితేనే తాము మాట్లాడతామని మోదీ అన్నారు. తమకు మధ్యవర్తిత్వం జరపాల్సిన అవసరం ఎవరికీ లేదని చెప్పార. కశ్మీర్ విషయంలో భారత్ వైఖరి ఎప్పుడూ ఒకటేనని ఆయన స్పష్టం చేశారు. పాక్ ఒక్క తూటా పేలిస్తే మీరు క్షిపణితో సమాధానం చెప్పాలని కూడా త్రివిధ దళాలకు ఆదేశాలు జారీ చేశారు. తీవ్రవాదులను కూడా భారత్ కు అప్పగించాలని కూడా రేపటి సమావేశంలో చర్చించాలని మోదీ చెప్పారు. తీవ్రవాదాన్ని అరికట్టడమే భారత్ లక్ష్యమని మోదీ స్పష్టం చేశారు.


Tags:    

Similar News