Narendra Modi : నేటి నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటన

ప్రధాని నరేంద్ర మోదీ నేటి నుంచి విదేశీ పర్యటనలకు వెళుతున్నారు. ఐదు దేశాల్లో పర్యటించనున్నారు

Update: 2025-07-02 02:53 GMT

ప్రధాని నరేంద్ర మోదీ నేటి నుంచి విదేశీ పర్యటనలకు వెళుతున్నారు. ఐదు దేశాల్లో పర్యటించనున్నారు. మొత్తం ఎనిమిది రోజుల పాటు ప్రధాని విదేశీ పర్యటన కొనసాగుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఘనా,, ట్రినిడాడ్,, లొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాలలో ప్రధాని ఎనిమిది రోజుల పాటు పర్యటించనున్నారు. నేటి నుంచి9వ తేదీ వరకూ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతుంది.

అనేక అంశాలపై...
ఆ యా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు, రక్షణ, అరుదైన భూమి ఖనిజాలు, ఉగ్రవాద నిరోధక సహకారం పై చర్చలు ఉంటాయని అధికారికవర్గాలు వెల్లడించాయి. దంతో పాటు బ్రెజిల్ లో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలోనూ ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఆర్థిక, ఇంధన, రక్షణ వ్యవహారాలపై చర్చించనున్నారు. జులై 9వ తేదీ వరకూ కొనసాగే ఈ పర్యటన రెండు ఖండాల్లో కొనసాగనుంది.


Tags:    

Similar News