Narnedra Modi : మోదీ దేశ ప్రజలకు దీపావళి కానుక
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు తీపికబురు చెప్పారు. ఈసారి డబుల్ దీపావళి ఉంటుందన్నారు
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు తీపికబురు చెప్పారు. ఈసారి డబుల్ దీపావళి ఉంటుందన్న మోదీ సంస్కరణల కోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. హై పవర్ కమిటీ ఏర్పాటు చేసి జీఎస్టీ సంస్కరణలు తెస్తామన్నారు. ఈ దీపావళికి బహుమతిగా ఇస్తామని చెప్పిన మోదీసామాన్యులకు ప్రయోజనం కలిగేలా రోజువారీ వస్తువుల ధరలు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. సంస్కరణల విషయంలో తమకు మద్దతు పలకాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.
ఫాస్టాగ్ వార్షిక పాస్ పై...
ఫాస్టాగ్ వార్షిక పాస్‍పై ప్రధాని మోదీ కానుక ప్రకటించారు. టోల్ ఫీ మూడు వేల రూపాయలు చెల్లిస్తే ఏడాది పాటు 200 క్రాసింగ్స్ ఉచితమని తెలిపారు.వార్షిక పాస్ కొనుగోలు నుంచి ఏడాది లేదా 200 క్రాసింగ్స్ ఉచితంమన్న మోదీ, నేషనల్ హైవేలు, ఎక్స్ ప్రెస్ హైవేలతో నేటి నుంచే అమలు కానున్నాయని ఆయన తెలిపారు. జాతీయ రహదారుల వెబ్ సైట్, రాజ్‍మార్గ్ యాత్ర యాప్ ద్వారా ఫాస్టాగ్. లభిస్తుందని తెలిపారు. దేశ వ్యాప్తంగా అన్ని టోల్ ప్లాజాలలో ఈ పథకం అమలులోకి వస్తుందని అన్నారు.