Narendra Modi : ఉప రాష్ట్రపతి రాజీనామాకు.. మోదీ పదవీ విరమణకు లింకేమిటి?

ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ రిటైర్ మెంట్ పై మరింత ఒత్తిడి పెరుగుతున్నట్లుంది.

Update: 2025-07-22 03:57 GMT

ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ రిటైర్ మెంట్ పై మరింత ఒత్తిడి పెరుగుతున్నట్లుంది. భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ రాజీనామాతో రాజకీయ నేతలపదవీ విరణమపై మరోసార చర్చ మొదలయింది. జగదీప్ దనఖడ్ తన 74 వ సంవతర్సరంలో పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే కేవలం వైద్యుల సూచనల మేరకు తనకు అనారోగ్య కారణాల వల్లనే ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అయినా సరే మళ్లీ ఈ రాజీనామా మోదీ రిైటర్ మెంట్ పైకి మళ్లింది. మోదీకి ఇప్పటికే 75 ఏళ్ల వయసు రావండంతో ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటారా? లేదా? అన్నది దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో కూడా చర్చ మొదలయింది.

మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలతో...
రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు డెబ్భయి అయిదేళ్లకే పదవీ విరమణ చేయాలంటూ ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సూచించారు. దీంతో ధనఖడ్ 74ఏళ్లకు రిటైర్ అయ్యారని, మిగిలిన వారూ అనుసరించాలని కొందరు సూచిస్తున్నారు. వయసు కంటే సంకల్పం ముఖ్యమని మరికొందరు వాదిస్తున్నారు.75 ఏళ్ల తర్వాత స్వచ్ఛందంగా రాజీకీయాల నుంచి తప్పుకోవాలని ఆయన కోరడంతో అది మోదీని ఉద్దేశించిందేనన్న కామెంట్స్ బలంగా వినిపించాయి. ఇప్పుడు 74 ఏళ్లకు ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్ ఖడ్ రాజీనామా చేయడంతో మరోసారి పదవీ విరమణపై చర్చ మొదలయింది. జూలై 9న నాగ్‌పూర్‌లో జరిగిన సమావేశంలో మోహన్ భగవత్ మాట్లాడుతూ రాజకీయ నాయకులు ఎవరైనా సరే 75 ఏళ్లు నిండగానే పదవీ విరమణ చేయాలని అన్నారు.
ఈ ఏడాదిలో 75 ఏళ్లు నిండి...
ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఈ ఏడాది 75 ఏళ్లు నిండి 76వ ఏటకు అడుగుపెట్టనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 2014, 2019, 2024 ఎన్నికల్లో వరసగా బీజేపీని అధికారంలోకి తెచ్చారు. ఆయన చరిష్మాకారణంగానే హ్యాట్రిక్ విజయాలు లభించాయంటున్నారు. అయితే మోదీని ఉద్దేశించి ఆర్ఎస్ఎస్ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారా? లేక సాధారణంగా చేసిన వ్యాఖ్యలు మోదీకి అనువదించారా? అన్నది తేలాల్సి ఉన్నప్పటికీ చర్చ మాత్రం మోదీ చుట్టూ తిరుగుతూనే ఉంది. ఈ ఏడాది సెప్టంబరు 17 నాటికి మోదీకి 75 ఏళ్లు నిండుతాయని, ఆయన కూడా రిటైర్ మెంట్ విషయాన్ని ఆలోచించాలని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఎక్స్ లో పోస్టు కూడా పెట్టారు. గతంలో అద్వానీ, వెంకయ్యనాయుడు, యడ్యూరప్పలను ఇదే వయసు అంశంపై తప్పించిన విషయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. మరోసారి రిటైర్ మెంట్ అంశం మోదీపైకి మళ్లిందనే చెప్పాలి.
Tags:    

Similar News