రాష్ట్రపతి ప్రసంగంలో పోలవరం ప్రాజెక్టు ప్రస్తావన

కొత్త పథకాలను అమలుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు

Update: 2025-01-31 06:39 GMT

కొత్త పథకాలను అమలుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. భావి తరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలను తీసుకుంటుందని తెలిపారు. పాత చట్టాలను కూడా సమీక్షిస్తున్నామని ఆమె తెలిపారు. భారత్ ను అభివృద్ధి వైపునకు వేగంగా తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పారు. దేశాభివృద్ధి కోసం తమ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు మరింత ముందుకు తీసుకెళతాయని ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు.

భారత్ త్వరలోనే అతి పెద్ద ...
భారత్ త్వరలోనే ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక శక్తిగా ఆవిర్భవిస్తుందని అన్నారు. భారత్ ను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్ గా మార్చేందుకు తమ ప్రభుత్వం పయనిస్తుందని మోదీ తెలిపారు. నిరుద్యోగులకు అవసరమైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వేగంగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ప్రపంచ స్థాయిలో మౌలిక వసతలు కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. దేశ ఆర్థిక, సామాజిక భద్రతకు మరింత మెరుగైన చర్యలను చేపట్టామన్న రాష్ట్రపతి పోలవరం నిర్మాణానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నామని తెలిపారు. పోలవరం నిర్మాణానికి పన్నెండు వేల కోట్ల రూపాయలు కేటాయించామని ద్రౌపది ముర్ము తెలిపారు.


Tags:    

Similar News