రాజ్యసభకు నలుగురిని నామినేట్ చేసిన రాష్ట్రపతి
రాజ్యసభకు నలుగురిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నామినేట్ చేశారు.
రాజ్యసభకు నలుగురిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నామినేట్ చేశారు. పదవీకాలం ముగిసిన నాలుగు రాజ్యసభ స్థానాలకు నామినేట్ చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఈ పదవులకు ఎంపిక చేశారు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి రాజ్యసభ పదవికి నామినేట్ చేస్తూ నిర్ణయంతీసుకున్నారు.
ఎంపికయిన నలుగురిని...
రాజ్యసభకు ఎంపికయిన నలుగురిలో ఉజ్వల్ నికమ్, హర్షవర్ధన్, మీనాక్షి జైన్, సదానందంలు ఉన్నారు. వివిధ రంగాల్లో నిష్ణాతులు, సేవ చేసిన వారందరికీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవకాశం కల్పించడం పట్ల ప్రధాని మోదీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. కొత్తగా నియమితులైన రాజ్యసభ సభ్యులందరికీ ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు.