రెండోసారి సీఎం.. అరుదైన ఘనత

గోవా ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ కొద్దిసేపటి క్రితం ప్రమాణస్వీకారం చేశారు

Update: 2022-03-28 06:48 GMT

గోవా ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ కొద్దిసేపటి క్రితం ప్రమాణస్వీకారం చేశారు. ఆయన రెండోసారి గోవా ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించనున్నారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో జరిగిన ఈ ప్రమాణస్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మైతో పాటు పలువురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

హాజరైన మోదీ....
గోవాకు రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన ఘనతను ప్రమోద్ సావంత్ సాధించారు. 2019లో ముఖ్యమంత్రిగా బాద్యతలను చేపట్టిన సావంత్ మొన్న జరిగిన ఎన్నికల్లో పార్టీని విజయపథాన నిలిపారు. నలభై స్థానాలున్న గోవా అసెంబ్లీలో బీజేపీ ఇరవై స్థానాలను సాధించింది. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు పలికారు. ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడిగా ప్రమోద్ సావంత్ కు గుర్తింపు ఉంది.


Tags:    

Similar News