రాజ్యసభకు కమల్‌హాసన్

ప్రముఖ హీరో కమల్ హాసన్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కానున్నారు.

Update: 2025-05-28 06:46 GMT

ప్రముఖ హీరో కమల్ హాసన్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కానున్నారు. డీఎంకే మద్దతుతో రాజ్యసభకు కమల్‌ హాసన్ వెళ్లనున్నారు. ఈ మేరకు డీఎంకే అధికారిక ప్రకటన చేసింది. తమిళనాడు నుంచి కమల్ హాసన్ ను రాజ్యసభకు పంపాలని స్టాలిన్ నిర్ణయించారు. కమల్ అభ్యర్థిత్వాన్ని ఖారరు చేశారు. రాజ్యసభలో ఖాళీగా ఉన్న ఎనిమిదిస్థానాలకు వచ్చే నెల 19వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.

నాలుగింటిలో ఒకటి...
ఇందులో ఆరు తమిళనాడు నుంచి భర్తీ కానున్నాయి. ఇందులో నాలుగింటిని డీఎంకే, రెండింటిని అన్నాడీఎంకే దక్కించుకోనున్నాయి. డీఎంకేకు లభించే నలుగురు రాజ్యసభ అభ్యర్థుల్లో ఒకదానిలో కమల్ హాసన్ పేరు ఖరారయింది.మక్కల్ నీది మయ్యమ్ పార్టీ పెట్టిన తర్వాత కమల్ హాసన్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే రానున్న ఎన్నికల్లో డీఎంకేతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో కమల్ హాసన్ ను రాజ్యసభకు పంపాలని డీఎంకే నిర్ణయించింది


Tags:    

Similar News