పుట్టిన ఊళ్లో రాజమౌళికి అరుదైన గౌరవం
కర్ణాటకలోని రాయచూరు జిల్లా ఎన్నికల ప్రచారకర్తగా ప్రముఖ దర్శకుడు రాజమౌళిని ఎంపిక చేశారు.
The newyork film critics circle award
కర్ణాటకలోని రాయచూరు జిల్లా ఎన్నికల ప్రచారకర్తగా ప్రముఖ దర్శకుడు రాజమౌళిని ఎంపిక చేశారు. ఓటర్లను చైతన్యవంతుల్ని చేయడానికి రాజమౌళి సేవలను ఉపయోగించుకోనున్నట్లు రాయచూరు జిల్లా అధికారి చంద్రశేఖర్ నాయక్ తెలిపారు. బాహుబలి, RRR సినిమాల ద్వారా దేశంగా, అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్న రాజమౌళి సేవలను ఈ ఎన్నికలకు ఉపయోగించుకోవాలని నిర్ణయించామని తెలిపారు.
ఎన్నికల ప్రచారకర్తగా రాజమౌళి...
కర్ణాటక శాసనసభకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజమౌళిని ఎన్నికల ప్రచారకర్తగా నియమించామని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు రాజమౌళి సేవలను ఉపయోగించుకుంటామని చెప్పారు. అందుకు రాజమౌళి కూడా అంగీకరించినట్లు ఆయన తెలిపారు. రాజమౌళి రాయచూరు జిల్లా మాన్వి తాలూకా అమరేశ్వర క్యాంప్ లో జన్మించారు. వివిధ మార్గాల ద్వారా రాజమౌళి చేత అధికారులు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు స్వచ్ఛందంగా తరలివచ్చేలా ప్రచారం చేస్తారు.