విమానం కాక్ పిట్ డోర్ తెరిచే ప్రయత్నం చేసిన ప్రయాణికుడు... కానీ ట్విస్ట్ ఏంటంటే?
ఎయిర్ ఇండియా విమానం గాల్లో ఉండగా కాక్ పిట్ డోర్ ను ప్రయాణికుడు తెరవబో్యాడు. అయితే అధికారుల విచారణ తర్వాత ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూసింది.
విమానం గాల్లో ఉండగా కాక్ పిట్ డోర్ ను ప్రయాణికుడు తెరవబో్యాడు. అయితే అధికారుల విచారణ తర్వాత ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూసింది. బెంగళూరు నుంచి వారణాసికి వెళతున్న ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానంలో ఒక ప్రయాణికుడు గాల్లో ఉండగానే కాక్ పిట్ లో చొరబడాలని ప్రయత్నించారు. కాని కాక్ పిట్ డోర్ తెరుచుకోలేదు. హైజాక్ చేయడం కోసం కాక్ పిట్ డోర్ లోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడేమోనని అనుమానించిన ప్రయాణికులు ఒకింత ఆందోళనకు గురయ్యారు.
టాయ్ లెట్ కోసం వెతుకుతూ...
విమాన సిబ్బంది అతనిని బలవంతంగా సీట్లో కూర్చో బెట్టారు. విమానం వారణాసిలో ల్యాండ్ అయిన తర్వాత పీఐఎస్ఎఫ్ సిబ్బందికి ప్రయాణికుడిని అప్పగించారు. అయితే విచారణలో మాత్రం ఆ ప్రయాణికుడు టాయ్ లెట్ కు వెళ్లేందుకు వెతుకుతూ కాక్ పిట్ డోర్ ను తెరిచేందుకు ప్రయత్నించాడని చెబుతున్నారు. మరొకవైపు ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ మాత్రం ప్రయాణికుల భద్రత విషయంలో రాజీపడబోమని ప్రకటించింది. ప్రయాణికుడు చేసిన పనితో విమానంలో ఉన్న ప్రయాణికులతో పాటు సిబ్బంది కూడా ఆందోళనకు గురయ్యారు.