ఆపరేషన్ సింధూర్.. 3000 మంది అగ్నివీరుల సత్తా!!
‘ఆపరేషన్ సిందూర్’ తో భారత సైన్యం తమ సత్తాను పాకిస్థాన్ కు చూపించింది.
operation sindhoor
‘ఆపరేషన్ సిందూర్’ తో భారత సైన్యం తమ సత్తాను పాకిస్థాన్ కు చూపించింది. ముఖ్యంగా పాకిస్థాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను అడ్డుకుంది. ఈ ఆపరేషన్‌లో అగ్నివీరులు కూడా కీలక పాత్ర పోషించారు. ఆర్మీలోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలోని అగ్నివీరులు పాకిస్థాన్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. గన్నర్లు, ఫైర్ కంట్రోల్ ఆపరేటర్లు, రేడియో ఆపరేటర్లు, క్షిపణులు-గన్స్ అమర్చిన భారీ వాహనాలకు డ్రైవర్లుగా అగ్నివీరులు ఆపరేషన్‌లో భాగమయ్యారు.
ఒక్కో గగనతల రక్షణ వ్యవస్థలో దాదాపు 150-200 మంది చొప్పున మొత్తంగా దాదాపు 3000 మంది అగ్నివీరులు ‘ఆపరేషన్ సిందూర్’లో పాల్గొన్నారు. సరిహద్దుల్లో పలు కీలక సైనిక స్థావరాలు, ఎయిర్‌బేస్‌ల్లో విధులు నిర్వర్తించారు.