ప్రభుత్వాల పనితీరుపై ప్రజలు సంతోషంగా ఉన్నారా..? ఏడాది పాలనపై త్వరలో సంచలన సర్వే..!
2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమ మొదటి సంవత్సర పాలనను పూర్తి చేసుకున్నాయి.
2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమ మొదటి సంవత్సర పాలనను పూర్తి చేసుకున్నాయి. ఈ విషయమై ప్రముఖ డిజిటల్ మీడియా మాధ్యమం వన్‌ఇండియా.. ప్రస్తుతం దేశ ప్రజల మూడ్‌ను కనుగొనే లక్ష్యంతో విస్తృతంగా బహుభాషాలలో సర్వేను ప్రారంభించనుంది. ఇది రొటీన్ సర్వేలా కాకుండా.. ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన సంవత్సరం తర్వాత వాటిని పాలించే నాయకులు, వారి విధానాలు, ఇచ్చిన వాగ్దానాల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో లోతుగా తెలుసుకునే ప్రయత్నం.
ఎన్నికలు జరిగిన రాష్ట్రాలలోని ప్రజాభిప్రాయంపై వన్ ఇండియా లోతైన, డేటా-ఆధారిత వివరాలను సేకరించనుంది. వన్ఇండియా మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఈ సర్వేను అనుభవజ్ఞులైన బృందం చేయనుంది. ఈ సర్వే ఎన్నికలు జరిగిన రాష్ట్రాలలోని పట్టణ, గ్రామీణ ప్రాంత భౌగోళిక పరిస్థితులు.. అక్కడి కులాలు, తరగతులు, స్త్రీ, పురుష, తరాల విభజనలను పరిగణనలోకి తీసుకోనుంది.. ఈ సర్వే ఆయా రాష్ట్రాలలోని ప్రజల స్వరాన్ని ప్రస్పుటంగా వెల్లడించనుంది.
ప్రస్తుత ఓటర్లు ఎన్నో ఆకాంక్షలతో, ఎంతో అవగాహనతో నాయకులకు పగ్గాలు అప్పగించారు. గద్దెనెక్కాక ప్రభుత్వాల పనితీరు, మౌలిక సదుపాయాల పురోగతి, సంక్షేమం అందుతున్న తీరు, నాయకత్వాల విశ్వసనీయత వంటి కీలక అంశాలను సర్వే పరిశీలిస్తుంది. ఈ పరిశోధనాత్మక సర్వే ఫలితాలు ప్రాంతాల వారీగా, పలు భాషలలో విడుదల కానున్నాయి. దేశ ప్రజాస్వామ్యం వైవిధ్యతను, సంక్లిష్టతను ప్రతిబింబించేలా.. ప్రజలు ఏమి ఆలోచిస్తున్నారో.. అధికారంలో ఉన్న వారి నుండి ఏమి ఆశిస్తున్నారో స్పష్టంగా తెలిపే విధంగా సర్వే ఉంటుంది.
నేతలకున్న ప్రజాదరణ గురించి మాత్రమే కాదు.. ప్రభుత్వాలలో బాగస్వామ్యులైన ఆ నేతల పనితీరును కూడా ఓటర్లు నిశితంగా గమనిస్తున్నారు.. నేతలు పాలనా ప్రమాణాలు అందుకోలేదని భావిస్తే.. ఓటర్లు ఆ నేతలపై తమకున్న విధేయతను మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సర్వే 2025-2026లలో జరిగే ఎలక్షన్స్ సహా భవిష్యత్ ఎన్నికలకు కొలమానంగా భావించే విధంగా ఉండనుంది.
ప్రభుత్వాల పనితీరుపై ప్రజలు సంతోషంగా ఉన్నారా..? సంచలనాత్మక సర్వేకు సిద్ధమైన వన్ఇండియా..!