గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ చమురుసంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.

గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ చమురుసంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.

Update: 2024-05-01 05:21 GMT

గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ చమురుసంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రతి నెల ఒకటో తేదీన పెట్రోలు, గ్యాస్ ధరలపై చమురు సంస్థలు సమీక్షించి ధరలను నిర్ణయిస్తాయి. ఇందులో భాగంగా మే 1వ తేదీ కావడంతో పెట్రో ఉత్పత్తులు, గ్యాస్ సిలిండర్ ధరలను సమీక్షించాయి. అయితే గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాలని నిర్ణయించాయి.

కమర్షియల్ గ్యాస్ సిలిండర్...
కేవలం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను మాత్రమే చమురు సంస్థలు తగ్గించాయి. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై పంధొమ్మిది రూపాయలు ఆయిల్ కంపెనీలు తగ్గించాయి. తగ్గిన ధరలు మే 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయని చమురు సంస్థలు తెలిపాయి. అయితే ఇళ్లకు వినియోగించే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరపై ఎలాంటి తగ్గింపు లేదు.


Tags:    

Similar News