పండగ పూట షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
పండగ వేళ దేశంలో గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి
పండగ వేళ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రతి నెల ఒకటో తేదీన చమురు కంపెనీలు గ్యాస్, పెట్రోలు ధరలు సమీక్షించి ధరలపై నిర్ణయం తీసుకుంటాయి. ఈ నేపథ్యంలో ఈరోజు దేశంలో ఎల్.పి.జి సిలిండర్ ధరను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకుని వినియోగదారులకు షాకిచ్చాయి.
పదహారు రూపాయలు...
సిలిండర్ ధరపై పదహారు రూపాయల వరకూ పెరిగింది. కేవలం పందొమ్మిది కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను మాత్రమే చమురు సంస్థలు పెంచాయి. పథ్నాలుగు కిలోల గృహోపయోగానికి వినియోగించే సిలిండర్ ధరలు మాత్రం పెంచలేదు. వాటి ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర పదిహేను రూపాయల వరకూ పెరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో సిలిండర్ ధర 1,595 రూపాయలుగా ఉంది.