చెన్నై టీంను నిషేధించండి

చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఒక్క తమిళ ప్లేయర్ లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తమయింది.

Update: 2023-04-12 07:18 GMT

తమిళనాడు అంటేనే భాషకు, ప్రాంతీయతకు ప్రాధాన్యమిస్తారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఒక్క తమిళ ప్లేయర్ లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తమయింది. తమిళనాడు శాసనసభలో జరిగిన ఈ ఆసక్తికరమైన చర్చలో పీఎంకే సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి ఉదయనిధి సెటైరికల్ గా సమాధానమిచ్చారు. తమిళులు లేని చెన్నై సూపర్ కింగ్స్ జట్టును నిషేధించాలంటూ పీఎంకే శాసనసభ సమావేశంలో డిమాండ్ చేసింది.

తమిళ ప్లేయర్ లేరంటూ...
రాష్ట్ర క్రీడా శాఖపై జరిగిన చర్చలో భాగంగా పీఎంకే సభ్యుడు, ధర్మపురి ఎమ్మెల్యే వెంకటేశ్వరన్ చెన్నై సూపర్ కింగ్స్ అంశాన్ని లేవనెత్తారు. ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్ లో ఒక్క తమిళ ప్లేయర్ లేరని, ఆ జట్టును నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై తమిళనాడు క్రీడాశాఖ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రతిభావంతులైన ఆటగాళ్లు తమిళనాడులో ఉన్నప్పటికీ ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నించారు. దీనికి మంత్రి ఉదయనిధి సమాధానమిస్తూ బీసీసీఐ కార్యదర్శిఅమిత్ షా కొడుకేనని, ఆయనను అడగాలని సెటైర్ వేశారు.


Tags:    

Similar News