వణికిపోతున్న ఈశాన్య రాష్ట్రాలు.. ఇప్పటికే 30 మంది మృతి

భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగి పడుతుండటంతో ఈశాన్య రాష్ట్రాలు వణికిపోతున్నాయి

Update: 2025-06-01 05:39 GMT

భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగి పడుతుండటంతో ఈశాన్య రాష్ట్రాలు వణికిపోతున్నాయి. అనేక రాష్ట్రాల్లో కురస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడ భారీగానే జరిగినట్లు అధికారులు తెలిపారు. కొండ ప్రాంతాల్లో ప్రయాణాలు ప్రమాదకరమని అధికారులు చెబుతున్నారు.

కొండచరియలు విరిగిపడి...
భారీ వర్షాల ఫలితంగా ఈరోజు పథ్నాలుగు మంది, రెండు రోజుల వ్యవధిలో 30 మంది మృతిచెందారు. అస్సాంలోని 12 జిల్లాల్లో దాదాపు 60వేల మంది ప్రభావితమయ్యారు. అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపుర్, మిజోరం వ్యాప్తంగా వేల మంది నిరాశ్రయులయ్యా రు. గౌహతిలోలో ఒక్క రోజే 111మి.మీ. వర్షం పడిందని, 67ఏళ్లలో ఇదే రికార్డ్ వర్షపాతం అని వాతావరణ శాఖ కేంద్ర అధికారులు తెలిపారు.


Tags:    

Similar News