Bengaluru : బెంగళూరును ముంచెత్తిన వాన

బెంగళూరులో రాత్రి కురిసిన వర్షంతో జనజీవనం స్థంభించి పోయింది

Update: 2025-09-19 07:30 GMT

బెంగళూరులో రాత్రి కురిసిన వర్షంతో జనజీవనం స్థంభించి పోయింది. బెంగళూరు నగరంలో 65 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని అధికారులు తెలిపారు.బెంగళూరులో గురువారం అర్ధరాత్రి మొదలైన వర్షం శుక్రవారం ఉదయం వరకు విడతల వారీగా కురిసింది. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ప్రధాన రహదారులపై భారీ ట్రాఫిక్ జామ్‌ ఏర్పడింది. నగరంలో ఇరవై నాలుగు గంటల్లో 65.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. డొడ్డబళ్లాపురలో 60 మి.మీ., రామనగరలోని చందురాయణహళ్లిలో 46 మి.మీ., బెంగళూరు గ్రామీణంలోని హెసరఘట్టలో 43 మి.మీ. వర్షం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.దీంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

నేడు ఎల్లో అలెర్ట్ ...
బెంగళూరుతో పాటు విజయపుర, బీదర్, కలబుర్గి, తుమకూరు, కోలార్‌, చిక్కబళ్లాపుర జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో ఈరోజు కూడా మోస్తరు వర్షం, ఉరుములు, గాలివాన వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. బెంగళూరు నగరంతో పాటు కర్ణాటక వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. కర్ణాటకలో అనేక చోట్ల అత్యధిక వర్షపాతం నమోదయింది. భారీగా కురిసిన వర్షంతో ప్రజలు ఇబ్బందులు పడటమే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా కోల్పోయినట్లు చెబుతున్నారు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు తమ ఆఫీసులకుచేరుకోవడానికి ఇబ్బందులు పడ్డారు.


Tags:    

Similar News