వేతన జీవులకు నిర్మలా సీతారామన్ శుభవార్త
వేతన జీవులకు నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంట్‌లో ఎనిమిదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తన ప్రసంగాన్ని గురజాడ సూక్తితో ప్రారంభించారు. 'దేశమంటే మట్టి కాదు.. దేశమంటే మనుషులోయ్’ అంటూ తెలుగ కవి గురజాడ అప్పారావు సూక్తిని నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు. బడ్జెట్ ప్రసంగానికి ముందు విపక్షాలు తీవ్ర నిరసన తెలపడంతో సభలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఈ పరిణామాల మధ్యే బడ్జెట్ ప్రసంగం సాగింది.
వేతన జీవులకు నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. రూ.12 లక్షల వరకు ఎటువంటి ఆదాయపు పన్ను ఉండబోదని తెలిపారు. ఐటీఆర్, టీడీఎస్ పరిమితి పెరిగింది. టీడీఎస్ పరిమితి రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. మధ్యతరగతిని దృష్టిలో ఉంచుకుని కొత్త పన్ను విధానం ఉంటుందని తెలిపారు. సీనియర్ సిటిజన్లకు టీడీఎస్, టీసీఎస్ పరిమితి రూ.50 వేల నుంచి రూ. లక్షకు పెంచారు. బీఎన్ఎస్ స్ఫూర్తితో కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని రూపొందించనున్నట్లు తెలిపారు.