ఎన్ఐఏ అధికారులు 22 కోట్ల సోదాలు
ఎన్ఐఏ అధికారులు రెండు రాష్ట్రాల్లో తనిఖీలు చేస్తున్నారు.
ఎన్ఐఏ అధికారులు రెండు రాష్ట్రాల్లో తనిఖీలు చేస్తున్నారు. బీహార్, హర్యానా రాష్ట్రంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో ఇరవై రెండు చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. అందిన సమాచారం మేరకు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఉగ్రకుట్ర కేసులో భాగంగా ఈ సోదాలు జరుగుతున్నాయి.
ఉగ్రకుట్ర కేసులో...
అనుమానితుల ఇళ్లలోకి జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు వెళ్లి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇటీవల ఢిల్లీ ఎర్రకోట సమీపంలో బాంబుపేలుళ్లు జరిగి పదుల సంఖ్యలో మరణించిన నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ తమ విచారణలో భాగంగా అనేక చోట్ల దేశ వ్యాప్తంగా దాడులు నిర్వహిస్తుంది. అందులోభాగంగానే నేడు బీహార్, హర్యానాలో ఇరవై రెండు చోట్ల దాడులు చేస్తున్నారు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.