India : నేటి నుంచి ఫాస్టాగ్ లో కొత్త నిబంధనలు
ఫాస్టాగ్ వినియోగదారులకు నేటి నుంచి కొత్త నిబందనలు అమలులోకి రానున్నాయి
ఫాస్టాగ్ వినియోగదారులకు నేటి నుంచి కొత్త నిబందనలు అమలులోకి రానున్నాయి. 'నో యువర్ వెహికల్' వెరిఫికేషన్ పూర్తి చేయకుంటే నవంబర్ 1 నుంచి మీ వాహనం ఫాస్టాగ్ చెల్లదు. దీనివల్ల టోల్ ప్లాజాల వద్ద నగదు రూపంలో రెట్టింపు టోల్ చెల్లించాల్సి వస్తుందని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ తెలిపింది. పారదర్శకత పెంచడానికి, మోసాలను నిరోధించడానికి కేంద్రం ఈ చర్య చేపట్టింది. ఇప్పటివరకు ఒకే ఫాస్టాగ్ ను వేర్వేరు వాహనాలకు ఉపయోగించడం, కొందరు జేబుల్లో పెట్టుకుని టోల్‌ను దాటడం వంటి లోపాల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. .
ఖచ్చితంగా కేవైవీ...
కొత్త నిబంధనల ప్రకారం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నేటి నుంచి KYVని తప్పనిసరి చేసింది. ప్రతి ఫాస్టాగ్ అది జారీ చేసిన వాహనంతో తప్పనిసరిగా అనుసంధాల్సి ఉంటుంది. దానివల్ల భారీ వాహనాల ట్యాగ్‌లను చిన్న వాహనాలపై ఉపయోగించడం కుదరదు. తక్షణమే మీ ఫాస్టాగ్ KYV వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలని సూచించింది. లేకుంటే టోల్ గేట్ల వద్ద ఫాస్టాగ్ చెల్లకుండా పోతుందని తెలిపింది. దీనిని గమనించి వాహన యజమానులు తమ కేవైవీని పూర్తి చేసుకోవాలని తెలిపింది.