టోల్ గేట్ దాటాలంటే ఇక సులువు.. గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

ఫాస్టాగ్ లేని వాహనదారులకు జాతీయ రహదారుల సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది

Update: 2025-11-15 02:54 GMT

ఫాస్టాగ్ లేని వాహనదారులకు జాతీయ రహదారుల సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఫాస్టాగ్ లేకపోయినా తక్కువ మొత్తం చెల్లించి టోల్ గేట్ ను దాటే అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ఈ నూతన విధానం అమలులోకి రానుందని జాతీయ రహదారుల సంస్థ తెలిపింది. జాతీయ రహదారుల సంస్థ తీసుకున్ేన ఈ నిర్ణయంతో ఫాస్టాగ్ లేని వాహనదారులకు స్వల్ప ఊరట లభించినట్లయింది. ఫాస్టాగ్ లేని వాహనదారులు టోల్ గేట్ దాటి వెళ్లాలంటే నిర్ణీత సొమ్ము కంటే అదనంగా కొంత మొత్తాన్నిచెల్లించి వెళ్లాల్సి ఉంటుంది.

యూపీఐ ద్వారా చెల్లిస్తే...
నగదు రూపంలో టోల్ గేట్ ఫీజు చెల్లించే వారికి అక్కడ ఉన్న టోల్ గేట్ ఫీజుపై రెండింతల రుసుము వసూలు చేస్తారు. అయితే తాజాగా కొత్త నిబంధనలతో యూపీఐ ద్వారా టోల్ గేట్ ఫీజు చెల్లిస్తే కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే వసూలు చేస్తారు. అంటే వంద రూపాయలు టోల్ ఫీజు ఉంటే నగదు రూపంలో అయితే రెండు వందలు చెల్లించి టోల్ గేట్ దాటాలి. యూపీఐ ద్వారా చెల్లిస్తే కేవలం 125 రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. నేటి నంచి ఈ నిబంధన దేశ వ్యాప్తంగా అమలులోకి రానున్నట్లు జాతీయ రహదారుల సంస్థ ప్రకటించింది.


Tags:    

Similar News