వాటితో తయారు చేసిన లోషన్లు, క్రీమ్‌లు, పౌడర్లకు దూరంగా ఉండండి

దేశంలో తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. ఇటీవల యూఏఈ నుంచి కేరళ వచ్చిన ఓ వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు

Update: 2022-07-15 15:02 GMT

దేశంలో తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. ఇటీవల యూఏఈ నుంచి కేరళ వచ్చిన ఓ వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించడంతో అతడిని ఓ ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో ఉంచారు. అధికారులు అతడి నమూనాలు సేకరించి పూణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. ఫలితాల్లో అతడికి మంకీపాక్స్ సోకినట్టు నిర్ధారణ అయిందని కేరళ ఆరోగ్యమంత్రి వీణాజార్జ్ తెలిపారు. బాధితులు ఈ నెల 12న కేరళ చేరుకున్నట్టు మంత్రి తెలిపారు. త్రివేండ్రం విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే డబ్ల్యూహెచ్ఓ (WHO), ఐసీఎంఆర్ (ICMR) మార్గదర్శకాలను అనుసరించి ప్రయాణికులను పరీక్షించినట్టు చెప్పారు. వైరస్ నిర్ధారణ వార్తల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గైడ్ లైన్స్ విడుదల చేసింది. దేశీ ప్రయాణికుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. విదేశీ ప్రయాణికులకు దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. దేశీయ ప్రయాణికుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. విదేశీ ప్రయాణికులకు దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.విదేశాల నుంచి వచ్చిన వారికి ఎలాంటి అనారోగ్య సూచనలు ఉన్నా.. జంతువులతో కలిసి ఉన్న వారికి దూరంగా ఉండాలి. చర్మ గాయాలు , జననేంద్రియ గాయాలు ఉన్నవారితో, అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో దూరం పాటించాలి. ఎలుకలు, ఉడుతలు, కోతులకు దూరంగా ఉండాలి. అడవి జంతువుల మాంసాన్ని లేదా వాటి నుంచి తయారుచేసిన ఎలాంటి ఉత్పత్తులను వాడవద్దు. ఆఫ్రికా అడవుల్లోనీ జంతువుల నుంచి తయారు చేసిన ఎలాంటి ప్రొడక్ట్స్ వాడకూడదు.
దద్దుర్లు, జ్వరం వస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. జ్వరం, జబ్బులున్న వాళ్లతో సన్నిహితంగా ఉండొద్దని మార్గదర్శకాల్లో పేర్కొంది కేంద్రం. అలాగే.. ఎలుకలు, ఉడుతలు, వన్యప్రాణులు, ఇతర జీవులకు దూరంగా ఉండాలని పేర్కొంది. అడవి జంతువుల మాంసం విషయంలో, ఉత్పత్తుల విషయంలో జాగ్రత్తా ఉండాలి. వణ్యప్రాణి సంబంధిత ప్రొడక్టులు.. లోషన్లు, క్రీమ్‌లు, పౌడర్లకు దూరంగా ఉండాలని తెలిపారు.


Tags:    

Similar News