Monkey Fever : కర్ణాటకకు మంకీ "ఫీవర్" .. ఇప్పటికే ఇద్దరు మృతి

కర్ణాటకు మంకీ ఫీవర్ భయపెడుతుంది. మంకీ ఫీవర్ తో ఇప్పటికే కర్ణాటకలో ఇద్దరు మరణించడంతో ప్రభుత్వం అప్రమత్తమయింది.

Update: 2024-02-05 01:48 GMT

కర్ణాటకు మంకీ ఫీవర్ భయపెడుతుంది. మంకీ ఫీవర్ తో ఇప్పటికే కర్ణాటకలో ఇద్దరు మరణించడంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. శివమొగ్గ జిల్లాకు చెందిన హోసనగర తాలూకాలో పద్దెనిమిదేళ్ల యువతి మంకీఫీవర్ తో మరణించింది. అలగే ఉడుపి జిల్లా మణిపాల్ కు చెందిన 75 ఏళ్ల వృద్ధుడు మంకీఫీవర్ తో మరణించినట్లు అధికారికంగా నిర్ధారించారు. దీంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

దాదాపు నలభై మంది వరకూ...
దీంతో అనేక మంది మంకీ ఫీవర్ తో బాధపడుతున్నట్లు గుర్తించింది. కోతులను కరిచే కీటకాలు మనుషులను కరిస్తే ఈ వ్యాధి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ప్రాధమిక దశలోనే చికిత్స చేయించుకుంటే ప్రాణాపాయం ఉండదని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతం కర్ణాటకను మంకీ ఫీవర్ వణికిస్తుంది. ఉత్తర కర్ణాటకలో 34, శివమొగ్గలో 12, చిక్కమగళూరులో మూడు కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జ్వరం, జలుపు వస్తే టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తున్నారు.


Tags:    

Similar News