Union Cabinet : నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం
నేడు కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు
నేడు కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమయ్యే కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన పలు కీలక నిర్ణయాలను ప్రకటించే అవకాశముందని తెలిసింది. దీంతో పాటు జీఎస్టీ సంస్కరణలపై ప్రజల్లో అవగాహన కల్పించడంపైన కూడా చర్చించనున్నారు.
ప్రధాన అంశాలపై...
దీంతో దేశంలో ఉన్న వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్న రైతులకు ఊరట నిచ్చేలా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశముందని కేంద్ర అధికార వర్గాలు వెల్లడించాయి. అదే సమయంలో దీపావళి సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ప్రయోజనాలపై కూడా కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది. దీంతో పాటు ట్రంప్ విధిస్తున్న సుంకాలపై కూడా ఈ సమావేశంలో చర్చించి దానికి ఊరట నిచ్చేలా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశముందని చెబుతున్నారు.