Union Cabinet : నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం
కేంద్ర మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది
కేంద్ర మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. మధ్యాహ్నం పన్నెండు గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధానంగా బీహార్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది.
ఈ రాష్ట్రాలకు సంబంధించి...
బీహార్, తమిళనాడు రాష్ట్రాలకు ఈ కేంద్ర మంత్రి వర్గ సమాశంలో వరాలు ప్రకటించే ఛాన్స్ ఉందని తెలిసింది. దీంతో పాటు దసరా, దీపావళి సందర్భంగా రైతులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశముందని తెలిసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న అదనపు సుంకాలపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి.