Union Cabinet : నేడు కేంద్ర మంత్రి వర్గ సమావేశం.. కీలక నిర్ణయాలివే

ఈరోజు కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది.

Update: 2025-09-24 03:09 GMT

ఈరోజు కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. జీఎస్టీ సంస్కరణలు అమలులోకి వచ్చిన తర్వాత జరుగుతున్న సమావేశం కావడంతో ఈ భేటీలో దీనిపై ప్రజల నుంచి వస్తున్న స్పందనతో పాటు వ్యాపారుల నుంచి వస్తున్న రెస్సాన్స్ పై చర్చించే అవకాశముంది.

పండగలు వస్తుండటంతో...
మరొకవైపు వరసగా దసరా, దీపావళి పండగలు వస్తుండటంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు చెప్పే అవకాశాలున్నాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి. అదే సమయంలో దేశంలో రైతులకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం కూడా ఈ సమావేశంలో తీసుకునే అవకాశముందని తెలిసింది. దీంతో పాటు ట్రంప్ విధించిన అదనపు సుంకాలతో పాటు H1B వీసా రుసుం పెంచడంపై కూడా కేంద్ర కేబినెట్ లో చర్చకు వచ్చే అవకాశముంది.


Tags:    

Similar News