Union Cabinet : నేడు కేంద్ర మంత్రి వర్గ సమావేశం
నేడు కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది
నేడు కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలతో భారత్ ఉత్పత్తులపై కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఆక్వా రైతులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.
ట్రంప్ విధించిన సుంకాలపై...
అదే సమయంలో ట్రంప్ విధించిన సుంకాల వల్ల ప్రభావం అయ్యే వస్తువల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశముందని అధికారిక వర్గాలు తెలిపాయి. దీనికి తోడు బీహార్, తమిళనాడు రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రకటనలు వెలువడే అవకాశముంది. దీంతో పాటు రైతులు, ఉద్యోగులకు మేలు చేకూర్చేలా నిర్ణయాలు వెలువడనున్నాయని తెలిసింది.