ఇండియాలో కొనసాగుతున్న కరోనా

భారత్‌లో 24 గంటల్లో 7,171 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు

Update: 2023-04-29 05:11 GMT

భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. అనేక రాష్ట్రాల్లో కేసులు అధికంగానే నమోదవుతున్నాయి. కేరళలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం పది రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఈ రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది.

యాక్టివ్ కేసులు...
కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 7,171 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో 51,314 కరోనా పాజిటివ్ యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.


Tags:    

Similar News