దాన్ని అత్యాచారంగా పరిగణించలేం.. భర్త నిర్దోషి

భార్యకు 18 ఏళ్లు పైబడి ఉంటే భారతీయ శిక్షాస్మృతి ప్రకారం వైవాహిక

Update: 2023-12-09 07:16 GMT

భార్యకు 18 ఏళ్లు పైబడి ఉంటే భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) ప్రకారం వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించలేమని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. 'అసహజ నేరం' కింద ఆరోపణల నుండి భర్తను నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో నిందితులను ఐపిసి సెక్షన్ 377 కింద దోషిగా నిర్ధారించలేమని పేర్కొంటూ, ఈ దేశంలో వైవాహిక అత్యాచారం నేరంగా పరిగణించబడలేదని జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా ధర్మాసనం పేర్కొంది. భార్యకు 18 ఏళ్లు నిండితే అత్యాచారాన్ని నేరంగా పరిగణించలేమని.. అసహజ నేరం కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న భర్తను నిర్దోషిగా ప్రకటించింది. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లు ఇప్పటికీ సుప్రీంకోర్టులో పెండింగులో ఉండడం వల్ల, భార్యకు 18 ఏళ్లు, అంతకుమించి ఉంటే వైవాహిక అత్యాచారానికి ఎలాంటి క్రిమినల్ పెనాల్టీ ఉండదని హైకోర్టు తెలిపింది. వైవాహిక బంధంలో ఎలాంటి ‘అసహజ నేరం’ జరిగే అవకాశం లేదన్న మధ్యప్రదేశ్ హైకోర్టు గత తీర్పును ఈ సందర్భంగా అలహాబాద్ హైకోర్టు ఉటంకించింది.

భర్త తనను దూషిస్తూ శారీరక వేధింపులకు గురిచేయడమే కాకుండా బలవంతం చేశాడని బాధిత మహిళ తన పిటిషన్‌లో ఆరోపించింది. కేసును విచారించిన హైకోర్టు అభియోగాల నుంచి ఆమె భర్తకు విముక్తి కల్పించింది. భర్త, అతడి బంధువులు ఆమెతో క్రూరంగా వ్యవహరించడం, గాయపరచడం వంటి అభియోగాల్లో మాత్రం అతడిని దోషిగా నిర్ధారించింది. సెక్షన్ 37 కింద అభియోగాల నుండి అతనిని నిర్దోషిగా విడుదల చేస్తూ, భర్త, భర్త బంధువులు (498-A), గాయపరచడం (IPC 323)కి సంబంధించిన సెక్షన్ల కింద కోర్టు అతన్ని దోషిగా నిర్ధారించింది.


Tags:    

Similar News