Big Breaking: మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం
మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.
మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. మావోయిస్టులు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. మార్చి 31వ తేదీ లోపు కూంబింగ్ ఆపితే తాము ఆయుధాలను వదిలేస్తామని చెప్పారు. ఈ మేరకు అధికారిక ప్రకనటను మావోయిస్టు పార్టీ ప్రకటన చేశారు. మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులకు మావోయిస్టులు లేఖ రాశారు. లేకుంటే దాడులను తీవ్ర తరం చేస్తామని హెచ్చరించారు.
ఆయుధాలు వదలాలంటే...?
ఇప్పటికే అన్ని జోనల్ కమిటీలకు తెలియజేశామని కూడా మావోయిస్టులు లేఖల్లో పేర్కొన్నారు. ప్రబుత్వతాలు స్పందించి కూంబింగ్ నిలిపివేయాలని కోరారు. ఇటీవల జరుగుతున్న ఆపరేషన్ కగార్, మావోయిస్టుల లొంగుబాట్లు, ఎన్ కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టు పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. కూంబింగ్ ఆపివేస్తే తాము ఆయుధాలను వదిలేస్తామని చెప్పింది.