దేవ్ జీ ని కోర్టులో హాజరు పర్చండి

దేవ్ జీ పోలీసుల అదుపులో ఉన్నారని వెంటనే కోర్టులో హాజరు పర్చాలని మావోయిస్టు పార్టీ కోరింది

Update: 2025-11-28 02:46 GMT

మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు దేవ్ జీ పోలీసుల అదుపులో ఉన్నారని వెంటనే కోర్టులో హాజరు పర్చాలని మావోయిస్టు పార్టీ కోరింది. ఈ మేరకు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. దేవ్ జీతో పాటు మరో యాభై మంది మావోయిస్టులు పోలీసుల అదుపులో ఉన్నారని తెలిపింది. ఈ నెల 18న మారేడుమిల్లి అడవుల్లో జరిగిన బూటకపు ఎన్ కౌంటర్ లో హిడ్మాతో పాటు ఆరుగురు మరణించారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

బూటకపు ఎన్ కౌంటర్లలో...
అనేక మందిని బూటకపు ఎన్ కౌంటర్లలో హతమారుస్తున్నారని, అందుకు నిరసనగా ఈ నెల 30వ తేదీన చత్తీస్ గఢ్ దండాకారణ్య బంద్ ను పాటిస్తున్నామని, దానిని విజయవంతం చేయాలని లేఖలో పిలుపునిచ్చారు. వెంటనే దేవ్ జీతో పాటు పోలీసుల అదుపులో ఉన్న యాభై మంది మావోయిస్టులను కోర్టులో ప్రవేశపెట్టాలని దండకారణ్య జోనల్ కమిటీ డిమాండ్ చేసింది.


Tags:    

Similar News