కుంభమేళా ముగియనుండటంతో భక్తుల సంఖ్య?
ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో భక్తుల రద్దీ కొనసాగుతుంది.
ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఇప్పటికే యాభై ఐదు కోట్ల మంది ప్రజలు వచ్చి పుణ్యస్నానాలు చేశారని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. త్రివేణి సంగమంలో స్నానమాచరించి ముక్తి పొందడానికి కోట్లాది మంది భక్తులు దేశం నలుమూలల నుంచి తరలి వస్తుండటంతో ప్రయాగ్ రాజ్ కిక్కిరిసిపోతుంది.
ఈ నెల 26వ తేదీతో...
ఈనెల 26వ తేదీతో కుంభమేళా ముగియనుంది. దీంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశముందని అంచనాలు వినపడుతున్నాయి. మరో ఐదు రోజులు మాత్రమే సమయం ఉండటంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. ఈ నెల 26వ తేదీన మహా శివరాత్రి సందర్భంగా రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉందని కూడా అంటున్నారు.