జస్టిస్ యశ్వంత్ వర్మ విషయంలో ముగ్గురు సభ్యులతో కమిటీ

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ విషయంలో లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా కమిటీనీ ఏర్పాటు చేశారు

Update: 2025-08-12 07:29 GMT

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ విషయంలో లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా కమిటీనీ ఏర్పాటు చేశారు. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమిస్తూ ఓంబిర్లా ఉత్తర్వులు జారీ చేశారు. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం జరగడంతో కొన్నాళ్ల క్రితం భారీగా నోట్ల కట్టలు బయట పడిన నేపథ్యంలో ఆయనపై విచారణ జరపాలని నిర్ణయించారు.

నివేదిక ఇచ్చిన తర్వాత...
పార్లమెంటులో దాదాపు 146 మంది సభ్యులు సంతకాలు చేసి అభిశంసన తీర్మానం ఇచ్చారు. ఈ తీర్మానానికి లోక్ సభ ఆమోదం తెలిపింది. దీంతో ముగ్గురు సభ్యుల ప్యానెల్ ను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఈ కమిటీలో జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ మనీందర్ మోహన్ వాస్తవ్, బివి. ఆచార్యలతో విచారణ చేయాలని స్పీకర్ నిర్ణయించారు. కమిటీ ఇచ్చిన నివేదికను పార్లమెంటు ముందు ఉంచుతానని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు


Tags:    

Similar News