సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీ
కోల్ కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ సందడి చేస్తున్నారు
కోల్ కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ సందడి చేస్తున్నారు. ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పేరుతో 70 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని కోల్ కతా లేక్‌టౌన్‌లోని శ్రీభూమి స్పోర్టింగ్ క్లబ్‌లో శనివారం వర్చువల్‌గా ఆవిష్కరించారు. గోట్ టూర్ ఇండియా 2025లో ఇది తొలి దశగా నిర్వాహకులు వెల్లడించారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ మంత్రి, శ్రీభూమి స్పోర్టింగ్ క్లబ్ అధ్యక్షుడు సుజిత్ బోస్ మాట్లాడుతూ, “శ్రీభూమిలో ఏర్పాటు చేసిన 70 అడుగుల మెస్సీ విగ్రహం చూసి ఆయనతో పాటు ఆయన బృందం సంతోషం వ్యక్తం చేసింది” అని చెప్పారు. సాల్ట్ లేక్ స్టేడియంలో సందడి చేశారు. మెస్సీకి జెర్సీని బహుమతిగా అందించారు. మెస్సీ నినాదాలతో స్టేడియం మారుమోగిపోయింది.
గోట్ టూర్ లో భాగంగా...
ఇదిలా ఉండగా, గోట్ టూర్ 2025లో భాగంగా మెస్సీ శనివారం ఉదయం కోల్ కతాకు చేరుకున్నారు. నగరమంతా అభిమానుల్లో ఉత్సాహం కనిపించింది. మెస్సీ రాకతో ఫుట్‌బాల్ ప్రేమికులు సంబరాలు చేసుకున్నారు. గదము ఇటీవలే పెళ్లి చేసుకున్నాం. మెస్సీ కోల్ కతా కు వస్తున్నారని తెలిసి హనీమూన్ ప్లాన్ రద్దు చేసుకున్నామని, ముందు మెస్సీని చూడాలనిపించింది. గత 10–12 ఏళ్లుగా ఆయన ఆటను ఫాలో అవుతున్నామని. చాలా ఉత్సాహంగా ఉందని కరణ్ అనే అభిమాని చెప్పారు. ఈ సందర్భంగా సాల్ట్ లేక్ స్టేడియంలో ఫుట్ బాల్ క్రీడాకారులను పరిచయం చేసుకుని వారితో ఫొటోలు దిగారు. కాగా మెస్సీ పర్యటన సందర్భంగా జడ్ ప్లస్ భద్రతను ఏర్పాటు చేశారు.