Ratan Tata : రతన్ టాటాకు ఘన వీడ్కోలు
పారిశ్రామికవేత్త రతన్ టాటా అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు
Ratan Tata
పారిశ్రామికవేత్త రతన్ టాటా అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు. ముంబయిలోని వర్లి శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలను బంధుమిత్రుల సమక్షంలో జరిగాయి. రతన్ టాటా పార్ధీవ దేహాన్ని చూసి నివాళులర్పించడానికి సినీ, రాజకీయ ప్రముఖులే కాకుండా రతన్ టాటాను అభిమానించే సామాన్యుల సయితం తరలి వచ్చారు.
అధికార లాంఛనాలతో...
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రభుత్వం తరుపున అంత్యక్రియలకు హాజరయ్యారు. ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరై ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ముంబయికి వచ్చి రతన్ టాటా పార్ధీవ దేహానికి నివాళులర్పించారు.