భారీగా నమోదయిన కేసులు

గడిచిన 24 గంటల్లో బారత్ లో 12,501 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే కరోనా కారణంగా నలభై మంది మరణించారు

Update: 2023-04-20 05:18 GMT

భారత్ లో కరోనా వైరస్ కేసులు భారీగా నమోదయ్యాయి. గత రెండు రోజు రోజులుగా తగ్గిన కేసులు మరింత పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 12,501 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే కరోనా కారణంగా నలభై మంది మరణించడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తయింది. అన్ని రాష్ట్రాలను కోవిడ్ నిబంధనలను పాటించాలని కోరింది. కరోనా కేసులు మరింత పెరిగే అవకాశముందన్న నిపుణుల హెచ్చరికతో మరింత అప్రమత్తం కావాలని సూచించింది.

యాక్టివ్ కేసుల సంఖ్య...
ప్రస్తుతం భారత్‌లో యాక్టివ్ కేసుల సంఖ్య 6,289 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదవుతున్నట్లు భారత ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకూ 4,48,57,992 కరోనా కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 5.46 శాతంగా నమోదయిందని అధికారులు చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు.


Tags:    

Similar News