నేడు కుంభమేళాకు జనం ఎంత మంది వచ్చారో తెలుసా?

ప్రయాగరాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు నేడు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు

Update: 2025-02-12 03:42 GMT

ప్రయాగరాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు నేడు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. మాఘ పౌర్ణమి కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. మాఘ పౌర్ణమి నాడు పుణ్యస్నానాలు చేస్తే మంచిదని భక్తులు భావించి ఈరోజు అధిక మంది ప్రయాగరాజ్ కు చేరుకున్నారు. ఈరోజు దాదాపు రెండు నుంచి మూడు కోట్ల మంది వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే నలభై ఐదు కోట్ల మంది వరకూ పుణ్యస్నానాలు చేశారు.

ఇసుకేస్తే రాలనంతగా...
నేడు ఇసుక వేస్తే రాలనంత మంది భక్తులు రావడంతో అధికారులు అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదే సమయంలో స్నానఘట్టాల వద్ద తొక్కిసలాట జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. స్నాన ఘాట్ ల వద్ద పెద్దయెత్తున పోలీసుల ను నియమించి భక్తుల స్నానాలు ఆచరించేలా చూస్తున్నారు.


Tags:    

Similar News