ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం

కొచ్చి - ముంబయి ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది.

Update: 2025-07-21 07:52 GMT

కొచ్చి - ముంబయి ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ముంబై రన్ వే పై ల్యాండింగ్ అవుతుండగా జారిపోయింది. దీంతో ప్రయాణికుల భయపడి విమానం నుంచి కిందకు దిగిపోయారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పైలట్ చాకచక్యంతో రన్ వే పై సేఫ్ గా ల్యాండింగ్ చేశారు.

భారీ వర్షం కారణంగానే...
అయితే ప్రమాదానికి గల కారణాన్ని ఎయిర్ లైన్ అధికారులు వివరించారు. భారీ వర్షం వల్ల ఘటన జరిగిందని ఎయిర్ లైన్స్ అధికారులు తెలిపారు. అయితే విమానం ఎందుకు అలా జారిపోయిందన్న దానిపై విమానయాన సంస్థ అధికారులు విచారణ జరుపుతున్నారు. విమానాన్ని నిలిపివేసి మొత్తం తనిఖీలను నిర్వహిస్తున్నారు.


Tags:    

Similar News