ప్రధాని మోదీని చంపేస్తాం.. ఎన్ఐఏకు బెదిరింపు మెయిల్ !
మోదీని చంపేస్తామని ఆ ఈమెయిల్ లో తెలిపారు. అందుకోసం ఇప్పటికే 20 మందితో స్లీపర్ సెల్ రెడీగా ఉందని, 20 కేజీల..
ముంబై : ప్రధాని నరేంద్ర మోదీని చంపేస్తామంటూ.. ముంబై ఎన్ఐఏ కార్యాలయానికి బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. మోదీని చంపేస్తామని ఆ ఈమెయిల్ లో తెలిపారు. అందుకోసం ఇప్పటికే 20 మందితో స్లీపర్ సెల్ రెడీగా ఉందని, 20 కేజీల ఆర్డీఎక్స్ ను కూడా సిద్ధం చేసినట్లు హెచ్చరించారు. ఈ మెయిల్ పై ఎన్ఐఏ కార్యాలయం అప్రమత్తమైంది.
కేంద్ర హోం శాఖ ఈమెయిల్ ను పరిశీలించి, అత్యున్నత దర్యాప్తుకు ఆదేశించింది. దర్యాప్తులో భాగంగా వివిధ ఏజెన్సీలకు ఈమెయిల్ వివరాలను పంపించారు. ఈమెయిల్ ఎవరు పంపారు ? ఎక్కడి నుంచి వచ్చింది ? దీనివెనుక ఎవరి హస్తం ఉందన్న కోణాల్లో విచారణ జరుగుతోంది. కాగా.. ఇది ఉగ్రవాదుల చర్యగా భావిస్తున్నారు ఎన్ఐఏ అధికారులు.