Kerala : కేరళ ముఖ్యమంత్రి విజయన్ ఇంటికి బాంబు బెదిరింపు

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అధికారిక నివాసానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది

Update: 2025-12-01 11:47 GMT

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అధికారిక నివాసానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. సీఎం అధికార నివాసం క్లిఫ్‌ హౌస్‌కి, పలయంలోని ఓ ప్రైవేట్‌ బ్యాంక్‌కు బాంబులు పెట్టారంటూ వచ్చిన ఈ-మెయిల్‌ తర్వాత అక్కడ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. సీఎం వ్యక్తిగత కార్యదర్శికి ఈ బెదిరింపు మెయిల్‌ అందడంతో వెంటనే ఆ యా ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు డాగ్ స్క్కాడ్, బాంబ్ స్క్కాడ్ అక్కడకు చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించారు. కొన్ని గంటలపాటు జరిగిన తనిఖీల తర్వాత అది తప్పుడు మెయిల్‌గా తేలింది.

మెయిల్స్ గతంలోనూ...
అలాంటి మెయిల్స్ గతంలో కూడా పలుసార్లు వచ్చినట్లు అధికారులు చెప్పారు. వాటిలో తమిళనాడులోని రాజకీయ పరిణామాలు, అక్కడ నమోదైన కేసుల గురించీ పంపిన వ్యక్తి ప్రస్తావించాడని వివరించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డార్క్‌ వెబ్‌ అప్లికేషన్లను ఉపయోగించి ఈ మెయిల్స్ పంపినట్లు తేలడంతో నిందితుడిని గుర్తించడం కష్టంగా మారినట్లు ఒక అధికారి చెప్పారు. అలాంటి మెయిల్‌ వచ్చిన ప్రతిసారి జాగ్రత్త చర్యగా తనిఖీలు తప్పనిసరిగా చేస్తున్నట్లు తెలిపారు.


Tags:    

Similar News