Bengaluru : నాటుకోడి కూరతో సిద్ధరామయ్యకు బ్రేక్ ఫాస్ట్

నేడు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇంటికి వెళ్లారు

Update: 2025-12-02 04:41 GMT

నేడు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇంటికి వెళ్లారు. బ్రేక్ర ఫాస్ట్ మీటింగ్ లో పాన్నారు. ఇటీవల సిద్ధరామయ్య ఇంటికి డీకే శివకుమార్ వెళ్లి బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ చేశారు. కర్ణాటక కాంగ్రెస్ లో తలెత్తిన సంక్షోభాన్ని నివారించేందుకు బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ లను నిర్వహించాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించడంతో వరసగా మీటింగ్ లు జరుతున్నాయి.

సంక్షోభాన్ని నివారించేందుకు...
సిద్ధరామయ్య కోసం నాటుకోడి కూరతో బ్రేక్ర ఫాస్ట్ ను డీకే శివకుమార్ ఇవ్వనున్నారు. నాడు ఎన్నికల సందర్భంగా పదవిని చెరి రెండున్నర సంవత్సరాలు పంచుకోవాలని నిర్ణయించిన నేపథ్యంలో ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పదవీ కాలం రెండున్నరేళ్లు పూర్తి కావడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది. అయితే ముఖ్యమంత్రి పదవి వదులుకోవడానికి సిద్ధరామయ్య సిద్ధంగా లేరు. దీంతో ఇద్దరూ కలసి కూర్చుని మాట్లాడుకోవాలని అధిష్టానం ఆదేశించింది. మరొకవైపు బీజేపీ ముఖ్యమంత్రిపై అవిశ్వాసం పెట్టింది.


Tags:    

Similar News