కమల్ హాసన్ కు కర్ణాటక హైకోర్టు మొట్టికాయలు
విలక్షణ నటుడు కమల్ హాసన్ పై కర్ణాటక హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది
విలక్షణ నటుడు కమల్ హాసన్ పై కర్ణాటక హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కన్నడ భాషపై ఆయన చేసిన వ్యాఖ్యలను హైకోర్టు తప్పు పట్టింది. ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కమల్ హాసన్ మాట్లాడుతూ తమిళ భాష నుంచి కన్నడ భాష పుట్టిందని వ్యాఖ్యానించారు. దీనిపై కన్నడ సంఘాలు మండిపడ్డాయి. కమల్ హాసన్ వ్యాఖ్యలపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు.
ఆధారాలేంటి?
అయితే దీనిపై కమల్ హాసన్ మాత్రం తాను క్షమాపణ చెప్పేందుకు ఇష్టపడలేదు. దీంతో ప్రాంతీయ అభిమానం రెచ్చగొడితే మాట్లడటం మంచిది కాదని కర్ణాటక హైకోర్టు తెలిపింది. క్షమాపణలు కోరి ఈ వివాదానికి తెరదించవచ్చు కదా? అని హైకోర్టు ప్రశ్నించింది. తమిళ భాష నుంచి కన్నడం పుట్టిందని ఏ ఆధారాలతో వ్యాఖ్యానించారని ప్రశ్నించింది.